స్టాటిస్టిక్స్ కార్యాలయం ప్రచురించిన డేటా ప్రకారం జర్మనీ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. ధరలను సర్దుబాటు చేసినప్పుడు మార్చి 2023 మొదటి త్రైమాసికంలో GDP 0.3 శాతం తగ్గిందని తెలుస్తోంది. అంతకు ముందు 2022 చివరి త్రైమాసికంలోను GDP 0.5 శాతం తగ్గింది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు GDP తగ్గితే సాంకేతికంగా ఆ దేశ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారకున్నట్టు భావిస్తారు.