ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడింది. అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ. 10లక్షల విలువ చేసే ఇళ్ల స్థలాలకు 50,793 మంది అక్క చెల్లెమ్మలను యజమానులను చేసింది ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశం నాకు కల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను' అని ట్వీట్ చేశారు.