ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి జగన్ 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నిధులు, పలు ప్రాజెక్టులపై ఆమె చర్చించినట్లు తెలుస్తోంది.ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోరారు. రేపు హస్తినలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.