విశాఖ రైల్వే న్యూకాలని నుంచి తాటిచెట్ల పాలెం వైపు వెళ్లే రోడ్డులో శనివారం ఉదయం ఓ మహిళకు పెను ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహణం పై వెళ్తున్న ఓ మహిళ తాటిచెట్లపాలెం రైల్వే క్వారటర్స్ సమీపంలో కారును అధిగమించే క్రమంలో అదుపుతప్పి కారుని ఢీకొని పడిపోయింది. ఆ సమయంలో వెనుక భారీ వహనాలేవి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్పగాయలవగా తోటి ప్రయాణికులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకువచ్చి ప్రధమ చికిత్స చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa