ఢిల్లీ రోడ్లపై నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లకు రాందేవ్ బాబా మద్దతుగా నిలిచారు. ‘రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటు. వేధింపులకు పాల్పడే వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. ఆ వ్యక్తి మహిళల గురించి చెత్తగా మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa