జీవీఎంసీ 53వ వార్డు జాకీర్ హుస్సేన్ నగర్ కాలనీని ఆనుకొని వెళ్తున్న ప్రమాదకరమైన 33, 11కేవీ విద్యుత్తు తీగలను ఎట్టకేలకు శనివారం తొలగించేందుకు విద్యుత్తు శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. కాలనీ ఏర్పా టైన కొత్తలో ఈ విద్యుత్తు తీగలను ఏర్పాటు చేశారు. అనం తరం కాలనీ నిర్మాణాలు పెరగడంతో అవి ప్రమాదకరంగా మారాయి. పలుమార్లు ఈ విద్యుత్తు తీగల వల్ల ప్రమాదాలు కూడా సంభవించాయి. చేతికందేంత ఎత్తులో తీగలు ఉండ టంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవా సులు నిత్యం భయాందోళన చెందేవారు. కాలనీలో ఉన్న ప్రమాదకరమైన విద్యుత్తు తీగలు తొలగించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించారు. దీంతో ఎట్టకే లకు స్పందించిన అధికారులు కాలనీలో ఉన్న ప్రమాదకరమైన విద్యుత్తు తీగలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa