పెడన నియోజకవర్గం పెడన మండలంలోని పెనుమల్లి సచివాలయాన్ని స్వామిత్వ స్పెషల్ కమిషనర్ డాక్టర్ సిరి శనివారం సందర్శించారు. పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సర్పంచ్ గరికపాటి రామానాయుడు కమిషనర్ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సచివాలయంలో రామానాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ స్వామిత్వ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొనే ఎందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా 200 గ్రామాలలో ఈ విధానాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ, స్వామిత్వ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 గ్రామాలలో ఈ విధానాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు భూములకు ఈ సర్వే ఫలితాలు వర్తిస్తాయన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు కూడా ఈ సమగ్ర సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. కృష్ణా జిల్లాలో 40 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి సర్పంచి వెంకటేశ్వరరావు, డిఎల్పిఓ జ్యోతిర్మయి, పంచాయితీ కార్యదర్శి అహ్మద్, వీఆర్వో ప్రసాద్, గోవిందరాజులు, ఇతర పంచాయతీ రాజ్ రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa