మంగళగిరి నగర పరిధిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం సిపిఐ పార్టీ నియోజకవర్గ కమిటీ సమావేశాన్ని నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరుబాటలో ముందుకు సాగుదామని అన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రజలను మభ్యపెడుతూ బటన్ నొక్కుతూ ప్రజా సేవకు తాను విపరీతమైన కృషి చేస్తున్నాని పదే పదే ప్రజలను నమ్మించే మోసం పూరితమైన వైఖరి ఆవలింబిస్తున్నారని అన్నారు.
నిడమర్రు లో గాలి వానకు లేఅవుట్ దగ్గర పనిచేస్తున్న కార్మికులకు సచివాలయ సిబ్బంది 30 మంది గాయాలయితే ప్రభుత్వం నోరెత్తలేదని ఇటు బందోబస్తు డ్యూటీ కి వచ్చిన కానిస్టేబుల్ పాము కాటుతో చనిపోతే ప్రభుత్వం నుండి స్పందన లేదని విమర్శించారు. రాజధానిని విచ్చిన్నం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాల పంపిణీ కి పూనుకుందన్నారు. సమావేశంలో సిపిఐ నాయకులు జాలాది జాన్ బాబు, కంచర్ల కాశయ్య, అన్నవరపు ప్రభాకర్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నందం బ్రహ్మేశ్వరరావు, ముసునూరు సుహాస్, బొర్రా మల్లికార్జునరావు, చిన్ని సత్యనారాయణ, బత్తూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.