స్వలింగ సంపర్కుల విషయంలో ఉగాండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. LGBTQకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని ఆ దేశ అధ్యక్షుడు యోవెరీ ముసెవెని(78) తాజాగా ఆమోదించారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారితో స్వలింగ సంపర్కంలో పాల్గొన్నా, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ ఉన్న వారు స్వలింగ సంపర్కంలో పాల్గొన్నా మరణశిక్ష విధిస్తారు. హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.