వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మొదటి రోజు నువ్వేం చెప్పావో దాన్నే నువ్వు, నీ ప్రభుత్వం చేస్తోంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన మీ విధ్వంస పాలన ఐదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజావేదిక కూల్చివేతకు సీఎం జగన్ ఆదేశాల్చిన వీడియోను ఈ ట్వీట్‌కు జత చేశారు.