విక్టరీ వెంకటేష్ త్వరలో ‘గురు’ సినిమాతో అభిమానులకు బాక్సింగ్ కోచ్‌గా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం వెంకీ ఓ పాట కూడా పాడారు. 30 ఏళ్ల తన సినీ జీవితంలో తొలిసారిగా తన స్వరానికి పని చెప్తున్నా అంటూ వెంకటేష్ ఆ పాట పాడారు ‘‘జింగిడి జింగిడి...’’ అంటూ సరదాగా సాగే ఆ పాటను వింటే మీరు కూడా అదుర్స్ అనకుండా ఉండలేరు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్, నాజర్, తణికెళ్ల భరణి ప్రధాన తారాగణంగా సుధా కె. ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa