టీడీపీ ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రంలోని యువత భవిష్యత్తుకు భరోసా లభిస్తోందని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. అర్థవీడు మండలం మొహిద్ధీన్‌పురం గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి సన్మానించారు. మానిఫెస్టోలో నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పన, యువగళం నిధి కింద నిరుద్యోగ యువతకు 3వేల నిరుద్యోగ భృతి వంటి పథకాలు పొందుపరచడంతో రానున్న ఎన్నికల్లో యువత మొత్తం పార్టీ వెంటే నడుస్తుందని యువకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మొహిద్ధీన్‌పురం గ్రామానికి చెందిన కిరణ్‌సాయి, పార్ధసారధి, రవికృష్ణ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.