ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, బడుగు, బలహీనవర్గాలు తల ఎత్తుకొని తిరిగేలా పరిపాలన సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పరిపాలనలో సీఎం వైయస్ జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. అక్కచెల్లెమ్మలు గడప దాటకుండా వలంటీర్ల చేత ప్రతీ సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. రైతులను ఆదుకున్నారు.. బీసీల అభ్యున్నతి కోసం మూడున్నరేళ్లలో రూ.85 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో టిష్యూ పేపర్ కంటే హీనమైందని, తుడిచి పారేయడానికి తప్ప దేనికీ పనికిరాదన్నారు.