ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పేలి... తల్లి మృతి.,,అసుపత్రిలో చికిత్సపొందుతున్న కుమారుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 31, 2023, 06:18 PM

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏసీ పేలి ఓ మహిళా ఉద్యోగి మృతి చెందింది. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు. దామర్ల శ్రీదేవి (50) తన కుమారుడు సాయితేజతో కలిసి ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలోని పల్లపోతువారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఒంగోలు జడ్పీ కార్యాలయంలోని పీఎఫ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీదేవి భర్త వెంకట సుబ్బారావు ఉపాధ్యాయుడిగా పనిచేసే వారు. నాలుగేళ్ల కిందట ఆయన మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వం శ్రీదేవికి ఒంగోలు జడ్పీ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చింది.


ఆదివారం (మే 28) రాత్రి శ్రీదేవి, ఆమె కుమారుడు.. రోజూ మాదిరిగానే ఇంట్లో ఏసీ వేసుకొని నిద్రించారు. అయితే, వారు నిద్రలోకి జారుకున్న తర్వాత అధిక వోల్టేజీతో విద్యుత్తు సరఫరా కావడంతో తీగలు కాలిపోయి ఏసీ పేలిపోయింది. నిద్రలోనే ఉన్న తల్లీకుమారులిద్దరూ ఏసీ నుంచి విడుదలైన వాయువులను పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్పృహ కోల్పోయారు.


శ్రీదేవి ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు. శ్రీదేవి, సాయితేజను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాటి నుంచి ఒంగోలు ఆసుపత్రిలో తల్లీకుమారులిద్దరూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శ్రీదేవి మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆమె కుమారుడు సాయితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com