ఉపాధ్యాయుల బదిలీల్లో ఆన్లైన్లోనే తాము పనిచేయాల్సిన పాఠశాలను ఎంపిక చేసుకునే సదుపాయం ఉంది. కానీ. సచివాలయ ఉద్యోగులకు ఆ అవకాశం లేదు అని బొబ్బిలి లో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులు బుధవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లడుతూ. కేవలం మండలాన్ని మాత్రమే ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు అని అన్నారు. ఆ మండలానికి వెళ్లాక ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించే ఆఫ్లైన్ కౌన్సిలింగ్లో గ్రామ సచివాలయాన్ని కేటాయిస్తారు. ఆఫ్లైన్ అంటే. రాజకీయ పలుకుబడి. ‘ఇతరత్రా’ అంశాలు ఎంత ప్రభావితం చేస్తాయో అందరికీ తెలిసిందే. దీనిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఆన్లైన్లో బదిలీ దరఖాస్తుల స్వీకరణ ఎందుకని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.