కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోనుంది. రూ.లక్ష కోట్లతో గిడ్డంగుల కోసం కొత్త పథకాన్ని రూపొందించగా.. 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే లక్ష్యంతో ఈ పథకం ఉండనుంది. సహకార రంగంలో గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలోనే దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.