ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం పాదయాత్రను జయప్రదం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 10:37 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని తెలుగుదేశంపార్టీ బిసి సెల్ రాష్ట్రకార్యదర్శి సుంకర వేణుగోపాల్ కోరారు. గురువారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నందున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బుధవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ గాండ్ల సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి పెనికెలపాటి రామకృష్ణ, పార్లమెంటరీ తెదేపా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు గోమేధికమ్ సుదర్శన్, తెదేపా పార్లమెంటరీ ఎస్టీ సెల్ ప్రధానకార్యదర్శి నాసారి లక్ష్మీనరసింహా, తెదేపా పార్లమెంటరీ దేవాంగసాధికారిక సమితి కన్వీనర్ అంపావతిన నాగసుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa