తెనాలిలో గురవారం ఉదయం ఓవ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. హతుని పేరు ప్రశాంత్ వయసు 28 సం॥రాలు. దుండగులు ముఖానికి మాస్కులు పెట్టుకొని వచ్చి ప్రశాంత్‌ను నరికారు. పాతకక్షలే రౌడీషీటరైన ప్రశాంత్ హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలందవలసిఉన్నవి.