కర్నూలు జిల్లా, బేతంచెర్ల మండలంలోని గోర్లగుట్ట గ్రామానికి చెందిన దాదాగాల్ల లక్ష్మన్న కుమారుడు రామకృష్ణను కులం పేరుతో దూషించిన ఆయన భార్య, మరో నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు బేతంచెర్ల ఎస్ఐ శివశంకర్ నాయక్ గురువారం తెలిపారు. ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు శిరీషతో గోర్లగుట్టకు చెందిన రామకృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలంగా వీరిద్దరి సంసారం సవ్యంగా సాగింది. రామకృష్ణ తరచూ భార్య శిరీషతో గొడవ పడుతుండగా భార్యభర్తలకు సర్దిచెప్పడానికి వచ్చిన మామ శ్రీనివాసులు, అత్త విజయలక్ష్మి, శరత్ చంద్ర, ప్రవీణ్‌లు రామకృష్ణను కులం పేరుతో దూషించారు. రామకృష్ణ భార్యతో పాటు మరో నలుగురిపై ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.