రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఏర్పాటు చేస్తానన్న న్యాయ రాజధాని ఏమైందని తెలుగు దేశం పార్టీ కర్నూలు జిల్లా న్యాయ విభాగం అధ్యక్షుడు కేఈ జగదీష్ ప్రశ్నించారు. గురువారం న్యాయవాదులు కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరై వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను ఘోరంగా వంచించారని అన్నారు. న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తానని చెప్పి వంచించాక.. జగన్ రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాలో అడుగు పెట్టారని ప్రశ్నించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే కుట్రలు చేశారని అన్నారు. లీగల్ సెల్ అధ్యక్షుడు జగదీష్ మా ట్లాడుతూ న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయలేదంటూ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన రోజే జగన్‌రెడ్డి మాటల్లో నిజాయితీ లేదని స్పష్టమైపోయిందని అ న్నారు. కార్యక్రమంలో ఎల్‌వీ ప్రసాద్, చంద్రశేఖర్, యువీ.లక్ష్మి, విజయలక్ష్మి, మాధవి, హరినాథచౌదరి, శ్రీహరి, గణేష్ సింగ్, వీరన్న, పాణ్యం టీడీపీ లీగల్ సెల్ నాయకులు రాజేష్, హరినాథ్‌రెడ్డి, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌యాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహేష్‌గౌడు, పాణ్యం తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్‌గౌడు, కేతూరు మధు, దొడ్డిపాడుబాషా, కేవీ రమణారెడి,్డ కరీం పాల్గొన్నారు.