వైఎస్సార్ యంత్రసేవా పథకం వైసీపీ నాయకులకు దోచిపెట్టేందుకేనని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పేరు మార్పు చేస్తూ రైతుగ్రూపుల ద్వారా యంత్రాలను అద్దె రూపంలో ఇచ్చేందుకు వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రవేశపెట్టారన్నారని విమర్శించారు.ఏ గ్రామంలో ఏ గ్రూపు చూసినా అందులో వైసీపీ నాయకులు, వారి బంధువులు, వాలంటీర్లు మాత్రమే ఉంటున్నారని ధ్వజమెత్తారు.