ఆన్ లైన్ లూడో గేమ్ ఆడుతూ వచ్చిన తగాదా కారణంగా వేస్ట్ బెంగాల్ కు చెందిన దయాల్ సర్కార్ ను హతమార్చిన కేసులో నిందితుడిని పలమనేరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అర్బన్ సీఐ చంద్రశేఖర్ కథనం మేరకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ముషీరాబాద్ జిల్లా బిల్బోరకప్ర మండలం దిగ్గల్ కండి గ్రామానికి చెందిన మహమ్మద్ రోని ఇస్లాంను స్థానిక పోలీసులు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. దయాల్ సర్కార్ పిలిస్తేనే తాను ఇక్కడికి పనికి వచ్చానని నిందితులు పోలీసులకు తెలిపాడు. పనులు ముగించుకుని రాత్రిపూట లూడో గేమ్ ఆడే వాళ్ళమని పేర్కొన్నాడు. ఆరోజు గేమ్ లో తొండి చేయడంతోనే తాను ఇనపరాడ్డుతో కొట్టినట్టు నేరాన్ని అంగీకరించాడు. సెల్ఫోన్ టవర్ ఆధారంగా అందిన సంవత్సరం మేరకు నిందితుడిని చిత్తూరులో పోలీసులు అరెస్టు చేశారు.