పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12వేల కోట్లకుపైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందన్నారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వనుందని, తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇస్తుందన్నారు. దీనిపై త్వరలో కేంద్ర కెబినెట్లో నిర్ణయం తీసుకోబోతోందన్నారు.