పీలేరు నియోజకవర్గం, గుర్రంకొండ మండలం, తరిగొండలో కొత్తగా నిర్మించిన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. శనివారం ఆయన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు జ్ఞాపికను బహుకరించారు. అనంతరం కిషోర్ కుమార్ రెడ్డి గుర్రంకొండ గ్రామ ప్రజలను కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.