సంబల్పూర్ డివిజన్ ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటి బయలుదేరే సమయాలను మార్పు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ. కె. త్రిపాఠి తెలి పారు. 3న విశాఖ- రాయపూర్- విశాఖ (08527- 08528) రైళ్లను రద్దు చేయగా, విశాఖ- నిజాము ద్దీన్(12807) సమతా ఎక్స్ ప్రెస్ గంట, అమృత్ సర్-విశాఖ(20808) హిరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యంగా బయలు దేరుతాయన్నారు.
ఈ నెల 4న సికింద్రాబాద్-భువనే శ్వర్(17016) విశాఖ, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హావా(12840) మెయిల్, వాస్కోడగామ-షాలి మార్(18048) అమరావతి ఎక్స్ ప్రెస్ రైళ్లు 4 గంటలు, రామేశ్వరం-భువనేశ్వర్ (20895) 45 నిమిషాలు, కేఎస్ఆర్ బెంగళూర్ సిటీ-భువనే శ్వర్(18464) ప్రశాంతి ఎక్స్ ప్రెస్ 30 నిమిషాలు ఆలస్యంగా బయలు దేరుతాయని వెల్లడించారు.