ఒడిశా రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో స్థానిక యువత మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది స్థానిక యువకులు నిన్న రాత్రే బాలేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు.