ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారని ఒడిశా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 288 మంది ప్రాణాలు కోల్పోయారని గతంలో చెప్పిన అధికారులు మృతదేహాలను లెక్కించడంలో పొరపాటు జరిగిందని చెప్పారు. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించారు. దీంతో మృతుల సంఖ్యలో తేడా వచ్చింది. చివరిగా లెక్కింపు చేసినప్పుడు స్పష్టత వచ్చింది. ఒడిశా సీఎస్ వెల్లడించారు.