ఒడిశా రైలు ప్రమాదంలో కోరమాండల్ రైలుబోగీల కింద ఉన్న ఓ వ్యక్తిని రక్షణ సిబ్బంది కాపాడారు. అసోంకు చెందిన దులాల్ మజుందర్ అనే వ్యక్తి 48 గంటలుగా రైలు శిథిలాల కింద సజీవంగా ఉన్నాడని సిబ్బంది తెలిపారు. అతడు కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలులోని జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించినట్లు చెప్పారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.