ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాలు ఆరోపించాయి. కానీ అశ్వినీ వైష్ణవ్ ఆ విమర్శలను పట్టించుకోలేదు. ప్రమాదం తర్వాత 51 గంటల్లో రైలు మళ్లీ పట్టాలపై పరుగులు తీసేవరకూ అక్కడే గడిపారు. కేంద్ర మంత్రినన్న హోదా పక్కనపెట్టి కార్మికుల్లో ఒకడిలా కలసిపోయారు. సహచర కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు తోడుగా నిలిచారు.