ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అరవింద్ వాలియా విశాఖలోరి తూర్పు నౌకాదళాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తాను కలిసి పలు అంశాలపై చర్చించారు. జాతీయ భద్రతలో తూర్పు నౌకాదళం కీలకంగా మారిందని, రాబోయే కాలంలో మరిన్ని మౌలిక వసతులు సమకూర్చుకోవాలని, దీనికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అవసరమని వివరించారు. ఆయా ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడానికి నేవీకి పూర్తి సహకారం అందించాలని దాస్‌గుప్తా ఈ సందర్భంగా కోరారు.