విద్యుత్ పోల్ పై ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా జరగడంతో పోల్ పై పనిచేస్తున్న రమణ విద్యుత్ ఘాతుకానికి గురై చావు బతుకుల మధ్య కొట్టు మిట్టులాడుతున్నడు. సోమవారం సాయంత్రం సమయంలో కైలాసపురంరోడ్ లక్ష్మినారాయణ నగర్ జోసఫ్ చర్చ్ పక్కన పోల్ పైకి ఎక్కి విద్యుత్ విద్యుత్ తీగలు మధ్య కూర్చుని మరమ్మత్తులు చేస్తుండగా కైలాసపురం ఎలక్ట్రికల్ అధికారుల. విద్యుత్ ను ఆన్ చేశారు. దీంతో రమణ కరెంట్ షాక్ కు గురై తీగలపై పడిపోయాడు. సిబ్బంది తేరుకుని షాక్ కు గురైన రమణ ను తాళ్ళ సాయంతో కిందకు దించి మెరుగైన వైద్య నిమిత్తం అస్పటల్ కు తరలించారు. రమణ ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నాడు. కుటుంబ సభ్యులు రమణకు మెరుగైన వైద్యం అందించాలని ఈ ఘాతుకానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు ను కోరారు