పర్యటక కేంద్రమైన అరకులోయ మండల పరిసర ప్రాంతంలో ఉదయం నుంచి దట్టమైన మంచు కమ్మేసింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఉష్ణోగ్రతలు పెరిగి వేసవి తాపంతో ప్రజలు విలవిల్లాడుతుంటే మరో పక్క మంచు సోయగం కనువిందు చేస్తుంది. మంచు ప్రభావం ఉండడంతో వాతావరణంలో ఏ మార్పులు వస్తాయి అని ప్రజలు భయపడుతున్నారు. అయితే అరకులోయ సందర్శనకు వచ్చిన పలు ప్రాంతాల పర్యటకులకు మంగళవారం ఉదయం మంచు సోయగాలు కనువిందు చేశాయి. అయితే మంగళవారం ఉదయం కురిసిన దట్టమైన పొగ మంచు కారణంగా వివిధ విధులకు వెళ్లే ఉద్యోగులు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతూ తమ తమ పనులకు వెళ్లారు.