మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు విస్రo దానియేలు మాట్లాడుతూ జగన్ రెడ్డి దళితులకు మేనమామన అని చెప్పి దళితుల ఓట్లతో గద్దెనెక్కి, దళితులపై హత్యలు, అత్యాచారాలు చేయిస్తూ, దళితులపై ఉక్కువాదం మోపుతున్నాడని విమర్శించారు. దళిత శాసనసభ్యుడు వీరాంజనేయ స్వామి మీద దాడి జగన్ రెడ్డి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తారా! ఒక శాసనసభ్యుడి చొక్కా చించి, వ్యాన్ లోకి విసిరేయడం చూస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ఉందా అని ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధికి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే హక్కు లేదా అన్నారు. రాష్ట్రంలో వైసిపి నాయకులు వీధి రౌడీలు, గుండాల ప్రవర్తించడం చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఒక కీలుబొమ్మగా తయారైంది అన్నారు. దళితులను దళితులపై ఉసిగొలిపి, వాళ్లకు వాళ్లే కొట్టుకునే విధంగా జగన్ రెడ్డి కుట్రపన్నాడు అన్నారు. నిన్న ఒక దళిత మహిళపై ట్రాక్టర్లతో తొక్కించి, కాళ్లతో తన్ని అతి కిరాతకంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. ఆ దళిత మహిళ చావుకు జగన్ రెడ్డి కారణమన్నారు. ఇది ప్రభుత్వ హత్యగా భావించాలన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే, అటువంటి కిరాతకుడికి, అంతకుడికి వైసిపి నాయకులు సన్మానాలు, సభలు పెట్టి గౌరవించడం సిగ్గుచేటు అన్నారు. వైసీపీలో ఉన్న దళిత శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేయిస్తుంటే కల్లుండి చూడలేని కబోదుల్లా తయారయ్యారని విమర్శించారు. రానున్న రోజుల్లో దళిత సమాజం మిమ్మల్ని క్షమించదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫైల్ అయిందని, రాష్ట్ర గవర్నర్ గారు వీటిపై తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ సమావేశంలో దళిత నాయకులు కలపాటి ప్రసాద్, దేవరపల్లి ఆంజనేయులు, వేల్పుల విజయ్ కుమార్, దోమకొండ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.