మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి వారిని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేష గిరి ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అడపా శేషగిరికి ఆలయ సిబ్బంది, దేవాలయ పురోహితులు వేదమంత్రోచ్చారణతో ఘనస్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.