ఖరీఫ్ సీజన్ లో రైతులకు పెట్టబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలని, 90 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం ఏపీ రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ కార్యలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సత్యన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి రంగన్నలు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, అందుబాటులో లేకపోవటంతో రైతులు ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. అనంతరం ఏఓ మహేశ్వరరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్ర మంలో నాయకులు కేసీ జబ్బార్, బీటీ చిన్నన్న, బాలరాజు, ఖాజా, మల్లికా ర్జునగౌడ్, దాదావలి, నరసింహులు, మాలిక్, ఎల్లప్ప పాల్గొన్నారు.