ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. మంగళవారం ఉదయం పోలవరం ఫ్రాజెక్ట్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే, అప్పర్ కాపర్ డ్యాంలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని ఫోటో ఎగ్జిభిషన్ ద్వారా జగన్‌కు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దగ్గరకు చేరుకున్న సీఎంకు డయాఫ్రం వాల్ పరిస్థితిని అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పరిశీలన పూర్తి అవడంతో హిల్ వ్యూ వద్ద సమీక్ష సమావేశానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.