శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పర్యావరణ పరిరక్షణ దేశ రక్షణ కోసం దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళం చేరుకున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన అశుతోష్ పాండే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనను అభినందించి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు.