ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్‌పై వైసీపీ సోషల్ మీడియా విభాగాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ‘‘పోలవరం ప్రాజెక్ట్‌లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల దానికి సమాంతరంగా కొత్తగా యూ ఆకారంలో మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించి, పాతదానికి అనుసంధానం చేయనున్నారు. ఇందుకు రూ.2,020 కోట్లు ఖర్చవనుంది. గత ప్రభుత్వ తప్పిదాలను సీఎం జగన్ సరిచేస్తున్నారు’’ అంటూ వైసీపీ ఎంపీ నందిగామ సురేశ్ ట్వీట్ చేశారు.