మంగళవారం నెల్లూరు జిల్లా, బుచ్చి-జొన్నవాడ మార్గంలోని పెనుబల్లి వద్ద ప్రమాదం జరిగింది. దళిత కుటుంబాలకు చెందిన ముగ్గురు కూలి పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను జొన్నవాడ పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం అందించి, నెల్లూరుకు తరలిస్తుండగా, సన్నం రమణయ్య (55) మృతి చెందాడు. కలగుంట మస్తానయ్య, కొంగు ఆదిశేషయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రమణయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. మృతుడికి భార్యాపిల్లలున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీర ప్రతాప్ తెలిపారు.