రైతు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ళ గ్రామం నందు 10. 95 లక్షల రూపాయల వ్యయంతో సొసైటీ భవనం ఆధునీకరణ, కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు అని రైతులకు మేలు జరిగే విధంగా ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేసిన విధంగా నేడు మన జగనన్న ప్రభుత్వంలో రైతుల కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రలను ఏర్పాటు చేశారు అని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను అక్కడే కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ కిషోర్, పాపినేని వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు కోనంగి ముక్కంటి, జడ్పిటిసి వూట్ల నాగమణి, ఎంపీపీ మార్కాపూడి గాంధీ, సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు బత్తుల రామారావు, చేనేకుమారి, గ్రామ పార్టీ అధ్యక్షులు రమేష్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.