రాష్ట్ర వైద్య మౌలికవసతుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. మురళీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నాని లతో కలిసి బుధవారం స్థానిక మెడికల్ కళాశాల సందర్శించి భవన నిర్మాణాల ప్రగతి, నిర్మాణాలు పూర్తయిన భవనాలలో సౌకర్యాల కల్పన వంటి అంశాలు పరిశీలించారు. మచిలీప ట్నంలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవా నికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎండి జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. మెడికల్ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించుటకు హాస్టల్ భవనాలు, ల్యాబ్స్ భవనాలు షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా కోసం 8. 8 కోట్లు మంజూరు చేసినట్లు, ఈ పనులు వెంటనే చేపట్టెల టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి అన్నారు.