కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలావుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెడ్డి అధ్యక్షతన.. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా కానుక పంపిణీకి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం లభించింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంఓయూలు చేసుకున్న.. పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను నిధులను విడుదల చేయడం, ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మంత్రివర్గం సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ.. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. 5వ తేదీ మధ్యాహ్నానికే ఆయా ప్రతిపాదనలన్నీ సాధారణ పరిపాలన శాఖకు చేరాయి.