శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలంలో గల పలు రైతు భరోసా కేంద్రాల్లో జామి వ్యవసాయ శాఖ అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సులను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు భూసార పరీక్షల వలన కలిగే ప్రయోజనాలు, పచ్చి రొట్ట విత్తనాలు ప్రాముఖ్యత, నవధాన్యాల సాగువలన పంట అభివృద్ధి, ఆర్బిక కేంద్రాల్లో పంట నమోదు తదితర అంశాలపై రైతులకు అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా ఏవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2023 ఖరీఫ్ సీజన్ కు గాను ఇప్పటికే యూరియా, బిజెపి ఎరువులు మండలంలో గల 17 ఆర్ బి కే కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కౌలు రైతులందరికీ భూ యజమానితో సమానంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ అధికారులు అలేఖ్య, ఉష తదితర రైతుల పాల్గొన్నారు.