ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై.. తాను పుస్తకం రాశానని.. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. 'దానికి అల్లుడు సుద్దులు' అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని ఆమె ప్రకటించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై కూడా లక్ష్మీపార్వతి పంచ్‌లు పేల్చారు. లోకేష్ పాదయాత్రపైనా సెటైర్లు వేశారు. 'టీడీపీ మేనిఫెస్టో అంతా మోసపూరిత హామీలే. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏమంటారు. చంద్రబాబు హామీల అమలుకు ఆర్బీఐ సొమ్ము కూడా చాలదు. గతంలో జగన్ హామీలు ఇచ్చినప్పుడు, అమలు చేస్తున్నప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఎవరూ మర్చిపోరు. లోకేష్‌ది పాదయాత్ర కాదు.. ఈవినింగ్ వాక్' అని లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు.