నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం మాచవరం రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మూగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. నిందితుల చెర నుంచి ఎలగోలా చి తప్పించుకొని పెట్రోల్ బంక్లోకి వెళ్లారు. దీంతో బంక్లో పని చేస్తున్న సిబ్బంది మహిళను నిందితుల చెర నుంచి రక్షించి.. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితుల్లో ఒకరు ఆటో డ్రైవర్ కాగా.. మరొక ఇద్దరు కందుకూరు టౌన్లో గూర్ఖాలుగా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం డీఎస్పీ రామచంద్ర, సీఐ వెంకటరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై అత్యచారయత్నం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.