సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 63 అంశాలకు ఆమోదం లభించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు, అమ్మఒడి పథకం నిధుల విడుదల, విద్యా కానుక పంపిణీ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో MoU చేసుకున్న కంపెనీలకు భూకేటాయింపు, పొలాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చడానికి రూ.6,888 కోట్ల కేటాయింపు తదితర నిర్ణయాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది.