ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమృత్ సరోవర్ పనులపై అసంతృప్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 12:22 PM

ఉపాధి పథకం నిధులతో చేపట్టే పనుల విషయంలో నాణ్యత కొరవడకూడదని ఉపాధి హామీ పనుల ప్రత్యేక అధికారి తిరుమల రావు అన్నారు. బుధవారం పోలాకి మండలం సుసరాం, ఈదులవలస, దండు లక్ష్మీపురం గ్రామాల్లో అమృత్ సరోవర్ పథకం కింద చేపట్టిన చెరువు పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చెరువు ఎత్తు చేసినా గట్లు సరిగాలేవని ఇచ్చిన కొలతల మేర ఉండాలన్నారు.


మిగిలిన డీఎలప్పురం ఈదులవలస గ్రామాల్లో చేపట్టిన అమృత్ సరోవర్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట వచ్చిన ఏపీడీ శైలజ కొలతలు వేయించారు. వీటికి ఇంకా మొక్కలు నాటలేదన్నారు. అన్నీ వెంటనే పూర్తయ్యేలా చూడాలని ఏపీవో రమణకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com