ప్రతిష్టాత్మకమైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం నూతన కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఫోరమ్ ఎన్నికలు నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ మల్లికార్జున నియమించిన ఫైవ్ మాన్ కమిటీ సమావేశం ఇటీవలే ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు పరిశీలన ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుత కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు జర్నలిస్ట్ ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫోరమ్ బైలా ప్రకారం ప్రస్తుతం ఉన్న 798 సభ్యులతో పాటు నూతన సభ్యత్వాలు ఇచ్చే అంశాన్ని కూడా అధికారులు చర్చించారు. ఈనెల 8 నుంచి 15 వరకు సభ్యత్వాల పరిశీలన కార్యక్రమం ఉంటుందని ఆర్డిఓ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో సభ్యులకు సంబంధించిన జాబితాలు ప్రకటించాలని ఆర్డీవో అధికారులకు సూచించారు.
వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రధాన కార్యాలయం, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం , ఆర్డీవో కార్యాలయాల్లో సభ్యత్వ జాబితాలు ప్రకటించాలని ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ కార్యవర్గం ను ఆదేశించారు. ఈ ప్రక్రియ ప్రస్తుత కార్య వర్గం చేపట్టాలన్నారు. ఓటర్ జాబితా సిద్దము కాగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్డీవో స్పష్టం చేశారు. తాజా సమావేశములో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డి ఐ జి బాల కృష్ణ, జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్, ఆర్ డీడీ మని రామ్ తో పాటు వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు, వైస్ ప్రెసిడెంట్ నాగరాజ్ పట్నాయక్. కోశాధికారి పి ఎన్ మూర్తి. పలువురు జర్నలిస్ట్ లు ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు వి జే ఎఫ్ , అర్ డి ఓ, ఐ అండ్ పి ఆర్ కార్యాలయాల్లో 798 సభ్యులు జాబితా ప్రకటన గురువారము వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ ప్రధాన కార్యాలయం నోటీస్ బోర్డ్ లో 798 సభ్యుల జాబితాను అధికారుల కమిటీ సమక్షము లో ప్రకటించారు.
అలాగే ఆర్ డి ఓ కార్యాలయము. ఐ అండ్ పి ఆర్ కార్యాలయం లో ఇదే జాబితాను సభ్యులకు అందు బాటులో ఉంచారు. ఈ కార్య క్రమం లో డీడీ మని రామ్ డి ఆర్ కార్యాలయం అధికారి గోపి నాథ్ పలువురు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు. సభ్యులకు మెరుగైన సేవలు అందించాం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సభ్యులందరికీ తమ కార్యవర్గం హయాంలో పారదర్శకమైన సేవలు అందించామని ఫోరమ్ ప్రస్తుత అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణములో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఫోరం ఎన్నికల నిర్వహణ, సభ్యత్వ పరిశీలనతో పాటు పలు అంశాలను అధికారులకు తెలియ చేసా మన్నారు. వందల మంది సభ్యులు ఉండగా కేవలము ఐదుగురు మాత్రం అర్దము పర్థం లేని విమర్శలు.
పిర్యాదులు చేశారని ఐతే వారికి ఇది అలవాటుగా మారిందని కొట్టి పారేశారు. ప్రతీ ఎన్నికలకు ముందు వారికి ఇదే పనిగా పెట్టు కుంటారన్నారు. ఆరోపణలు చేసే వారు తొలుత వారి సంఘాలు, వసూలు చేసిన మొత్తాలు విజెఎఫ్ సభ్యులకి చెప్పి విలీనం చెయ్యాలని కోరారు. ఆయా కార్య క్రమాలు లో ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ అర్. నాగరాజ్ పట్నాయక్, కోశాధికారి పి. ఎన్ మూర్తి, కార్య వర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, గిరి బాబు, డేవిడ్, సనపల మాధవరావు, శేఖర్ మంత్రి, సీనియర్ పాత్రికేయులు హేమ సుందర్, కిల్లి ప్రకాష్ రావు, గంటా చంద్ర శేఖర్ తో పాటు భారీ గా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.