పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలిలతో మాట్లాడి వాళ్ళు పడుతున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో అధికారుల అవగాహనా లోపం వలన ఒక్కోరకంగా పనులు నమోదు అవుతున్నాయని, చుట్టూ పక్కన ఉన్న అన్ని మండలాలలో 270 రూపాయలు ఇస్తుంటే, యు. కొత్తపల్లి మండలంలో కొమరగిరి పంచాయితీలో కొమరగిరి, చిన్నకలవల దొడ్డి ప్రాంతాలకు చెందినా ఉపాధి కులీలకు మాత్రం 220 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ కూలిలు మొత్తం చేసే పని ఒకటే, ఉపాధి హామీ కూలిలకు ఇచ్చే మజ్జిగ, టెంట్లు, ఇవ్వకపోగా, వారి వడ దెబ్బకు తగిలితే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిడ్స్ కూడా అందుబాటులో లేవని, మిగత మండలాలు, ఇక్కడకి ఇంత తేడా ఎందుకు వస్తుందని పీడికి ఫోన్ లో అడిగి మరి తెలిసికోవడం జరిగింది. వెంటనే మిగిలిన మండలాల వారికీ వచ్చే విధంగా ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టి డిమాండ్ చేస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎటువంటి లోటుబాటులు లేకుండా ఉండేవని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.