ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఓ వ్యక్తి గుడిలో నమాజ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వేకువజామున హాపూర్‌లోని ఛండీ ఆలయంలో అమ్మవారికి తొలి పూజ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆలయ ఆవరణలో తనతో తెచ్చుకున్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేశాడు. దీంతో అతనిని భక్తులు అడ్డుకున్నారు. ఇక నమాజ్ చేయడంతో ఆలయాన్ని గంగా జలంతో రెండుసార్లు శుద్ధి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa